సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఉద్యోగులూ.. నాన్-వెజ్ వదిలేయండి: ఎయిర్ ఇండియా (Air India employees | vegetarian | Airline afloat | AI canteen | veg thali | Chicken,)
Feedback Print Bookmark and Share
 
ఆర్థిక మాంద్యం ప్రభావంతో పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను బయటపడ వేసేందుకు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఆయా క్యాంటిన్లలో సోమవారం నుంచి మాంసాహారాన్ని ఇవ్వడం మానేసి దాని స్థానంలో కేవలం శాకాహారాన్ని మాత్రమే ఇస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఏఐ క్యాంటిన్లో సుమారు 700 నుంచి 1100 మంది ఉద్యోగులు భోజనం చేస్తుంటారు. వీరిలో అధికులు మాంసాహార ప్రియులు. వీరికి చికెన్ ముక్క లేనిదో ముద్ద దిగదు. కానీ అందరికీ సోమవారం వెజ్ తాలీ( రొట్టెలతో కూడిన శాకాహారం) వడ్డించడం మొదలుపెట్టారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఇండియా క్యాంటిన్లలో మాంసాహారాన్ని వదిలేసి కేవలం శాకాహారాన్ని వడ్డించడం ద్వారా ఎయిర్ ఇండియాకు ఏటా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా.

మాంసాహారం వడ్డించడం మానేశారు సరే... శాకాహారం ధర కూడా పెంచుతారా...? అనే ప్రశ్నకు ఏఐ అధికారి ఒకరు సమాధానమిస్తూ... పరిస్థితులకు అనుగుణంగా శాకాహారం ధరలో కూడా స్వల్ప మార్పులు చేసి కాస్త పెంచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

కాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఏఐ క్యాంటీన్లో వారానికి కనీసం 100 కిలోగ్రాముల చికెన్ వినియోగమయ్యేదనీ, తమ నిర్ణయంతో ఇప్పుడదంతా ఆదా అవుతుందని తెలిపారు. అయితే ఢిల్లీ ఉద్యోగులకు చికెన్ అంటే ప్రాణమనీ, ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చినందుకు కాస్త బాధగా ఉన్నప్పటికీ అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురైందని అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.