సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రెండువేల మందిని నియమించనున్న టయోటా (Small Car | Toyoto | TMC | TKM | MD | Hiroshi nakagava | Banglore | India)
Feedback Print Bookmark and Share
 
దేశీయ మార్కెట్లో 2011లోపు అతి చిన్న కారును విడుదల చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకున్న టయోటా మోటార్ కార్పోరేషన్ (టీఎమ్‌సీ) దేశంలో రెండు వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

రానున్న రెండు సంవత్సరాలలోపు తమ సంస్థలో రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టయోటా కిలరేస్కర్ మోటర్ (టీకేఎమ్) మేనేజింగ్ డైరెక్టర్ హిరోశీ నాకాగావా తెలిపారు.

తాము వచ్చే రెండు సంవత్సరాలలో దేశీయ మార్కెట్లో అతి చిన్న బుల్లికారును ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను రూపొందించుకున్నామని, భారతదేశంలో కిలరేస్కర్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నామని, దీనిని టయోటా కిలరేస్కర్ మోటర్ పేరుతో పిలవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం తాము సంయుక్తంగా రూపొందిస్తున్న అతి చిన్న కారు నిర్మాణానికి బెంగుళూరులో దాదాపు రూ. 3,200 కోట్ల పెట్టుబడితో రెండవ కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.

భారతదేశంలో తాము ప్రవేశపెట్టబోయే చిన్న కార్ల నిర్మాణానికి సంబంధించి తమకు చాలా మంది కార్మికులు అవసరం అవుతారని, దీనికి గాను తాము రెండువేల మందిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఆయన టోక్యోలో వెల్లడించారు.

ప్రస్తుతం తాము నియామకాలు చేపట్టే ప్రక్రియను ప్రారంభించామని, ఇది వచ్చే రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. దీంతో తమ కంపెనీనుంచి ప్రతి ఏడాది దాదాపు ఏడు వేల వాహనాలు మార్కెట్లోకి వస్తాయని, వీటిని ప్రతి ఏడాది రెండు లక్షల వాహనాలకు పెంచేందుకు తాము ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

బెంగుళూరులోని తమ కంపెనీలో ఏడాదికి 80 వేల వాహనాలు తయారవుతున్నాయి. ఇక్కడ సేల్స్, మార్కెటింగ్, కార్మికరంగానికి సంబంధించి దాదాపు నాలుగువేలమంది ఉద్యోగులున్నారని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.