ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 107 శాతం లాభాలు పొందిన డా. రెడ్డీస్ ల్యాబ్ (Pharmaceutical major | Dr Reddys Laboratories | Net profit | September 2009)
దేశీయ మందుల తయారీ రంగంలో అగ్రగామిగానున్న డాక్టర్. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 107 శాతం నికర లాభాలను ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 106.55 శాతం పెరిగి రూ. 217.3 కోట్లకు చేరుకుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు శుక్రవారం వెల్లడించింది.
అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో కంపెనీకి చెందిన నికర ఆదాయం 105.2 కోట్లుగా ఉండిందని, దీంతో ప్రస్తుతం వచ్చిన నికర ఆదాయంతో పోలిస్తే దాదాపు 106.55 శాతం వృద్ధి జరిగిందని కంపెనీ తెలిపింది.