సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మెటాస్‌లో పెరిగిన విదేశీ పెట్టుబడులు (Maytas | September 30th | SQ | FY | Foriegn Investment | BSE)
Feedback Print Bookmark and Share
 
మెటాస్ ఇన్ఫ్రాలో విదేశీ పెట్టుబడులు పెరిగి 10.7 శాతానికి చేరుకున్నాయి.

మెటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలో సెప్టెంబర్30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో విదేశీ పెట్టుబడులు 10.69 శాతం పెరిగాయని విదేశీ కంపెనీ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.

ఇదే నిరుడు ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఈ సంస్థలో విదేశీ పెట్టుబడులు 7.26 శాతంగా ఉన్నట్లు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాంతానికి మెటాస్ ఇన్ఫ్రా సంస్థలో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వాటా 3.43 శాతంగా ఉండింది.

ఈ ఏడాది జనవరి నెలలో మెటాస్ సంస్థలో కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగనట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామలింగం రాజు ప్రకటించడంతోపాటు కంపెనీకి రాజీనామా సమర్పించారు. దీంతో కంపెనీ లా బోర్డు అదేశానుసారం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ 2009 ఆగస్టు 31 నాటి నుంచి మెటాస్ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకుంది.

దీనికిగాను కంపెనీ 1 కోటి 32 లక్షల 50 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రతి షేరును రూ. 112.80లతో కొనేందుకు ముందుకు వచ్చింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.