ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రాష్ట్ర మార్కెట్‌లో సెడాన్ ఇండిగో మాంజా బ్రాండ్! (Market | Indigo Manja | TATA motors | Business | Petrol | Car)
దేశ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ సంస్థ కొత్తగా మరో కారును రాష్ట్ర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. తన నూతనతరం సెడాన్ కారు ఇండిగో మాంజాను రాష్ట్ర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. బహుళ జనాదరణ పొందిన ఇండిగో బ్రాండ్‌కు అధునాతన రూపమిది. నూతన హంగులు, ఆకర్షణలతో స్టైలిష్‌గా రూపొందిన ఈ కారులో అంతర్గత అలంకరణ ఖాతాదారులను ఆకట్టుకుంటుంది.
ఈ కారు పొడవు 4.4 మీటర్లు, 1.7 మీటర్ల వెడల్పుతో 2,520 ఎంఎం వీల్ బేస్‌తో ఈ కారును రూపొందించినట్టు చెప్పారు. 460 లీటర్ల ఇంధన నిల్వ సామర్ధ్యం చేసుకోవచ్చు. వీటితో పాటు.. డ్రైవర్‌తో పాటు.. ప్రయాణికులు కూడా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ఈ కారుకు ప్రత్యేక అలంకరణగా ఉంది. పెట్రోల్, డీజల్ రెండు వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతోంది. 6.58 లక్షల ఎక్స్‌షోరూం ధరలో ఏడు రంగులలో లభ్యమయ్యే ఇండిగో మాంజాకు రెండు సంవత్సరాలు లేదా 75 వేల కిలోమీటర్లకు వారంటీ కూడా ఉంది.