సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2010 నాటికి 10 శాతానికి చేరుకోనున్న ద్రవ్యోల్బణం (Inflation | touch | March | New Delhi | Assocham | global financial)
Feedback Print Bookmark and Share
 
వచ్చే 2010 మార్చి మాసాంతానికి ద్రవ్యోల్బణం పది శాతానికి చేరుకోవచ్చని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అభిప్రాయపడింది. అక్టోబరు పదో తేదీతో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం ఒక శాతానికి చేరుకుంది. ఏడు నెలల తర్వాత ఒక శాతానికి చేరుకోవడం ఇదే తొలిసారి. అయితే, ఆహార వస్తువుల ధరలు నానాటికి పెరిగి పోవడం, ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర అంశాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణాలు అవుతాయని అసోచామ్ అభిప్రాయపడింది.

అందువల్ల ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఈ బాడీ సూచించింది. అంతేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడం, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గడం కూడా మరో కారణంగా అసోచామ్ తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, ఆర్థిక ద్రవ్య లోటును భర్తీ చేసేందుకు మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు మళ్లించాలని కోరింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.