సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » కొత్త వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన హోండా (Two Wheelers | Production | Japan | Honda Motor Company | India | Delhi)
Feedback Print Bookmark and Share
 
ప్రపంచంలోనే ద్విచక్ర వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న జపాన్‌‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో మోటోస్కూటర్ ఏవియేటర్ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది.

జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు చెందిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీలో మంగళవారం మోటోస్కూటర్ ఏవియేటర్‌కు చెందిన కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

తాము ప్రవేశపెట్టిన కొత్త మోడల్ వాహనంలో సరికొత్త స్టైల్‌తోపాటు మరిన్ని హంగులను పొందుపరిచామని, దేశంలోని 30 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని రూపొందించామని కంపెనీ ప్రతినిధి వివరించారు.

తమ కంపెనీ రూపొందించిన ఆటోమేటిక్ మోడల్‌ వాహనంలో పర్యావరణానికి సంబంధించిన బీఎస్-3ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 110 సిసి ఇంజన్, దీని సామర్థ్యం 8 బిహెచ్‌పిగా ఉంటుందని కంపెనీ వివరించింది.

ఐదు రంగుల్లో ఈ వాహనం లభ్యమౌతుందని, ఈ నెల చివరికి దేశంలోని అన్ని షోరూంలలో తమ వాహనాలు అందుబాటులోకి వస్తాయని, ఏవియేటర్ స్టాండర్డ్ వాహనం యొక్క ఎక్స్ షో రూం ధర రూ. 42160లు, డీలక్స్ వాహనం ధర రూ. 47160లుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.