ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » లాభాలను ఆర్జించిన హెక్సావేర్ టెక్నాలజీస్ (IT services | Hexaware Technologies | Net profit | Bombay Stock Exchange)
దేశంలో ఐటీ సేవలను అందిస్తున్న హెక్సావేర్ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికాంతానికి రూ. 41 కోట్ల లాభాలను ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి హెక్సావేర్ టెక్నాలజీస్ సంస్థ రూ. 41.34 కోట్లను ఆర్జించిందని సంస్థ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి సంస్థ జరిపిన వ్యాపారంలో నికర ఆదాయం రూ. 263.15 కోట్లు తగ్గిందని, అదే నిరుడు ఇదే కాలానికి వచ్చిన ఆదాయంలో రూ. 294.61 కోట్లుగా ఉండిందని కంపెనీ తెలిపింది.
కంపెనీకి చెందిన స్టాండ్ లోన్‌ల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ. 36.63 కోట్లకు చేరుకుందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 11.04 కోట్లుగా ఉండిందని కంపెనీ వివరించింది.