దేశంలో బియ్యం దిగుమతులపై ప్రస్తుతమున్న 70 శాతం సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
దేశంలో దిగుమతి చేసుకుంటున్న బియ్యంపై ప్రస్తుతమున్న సుంకం 70 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో దేశంలోని బియ్యం మార్కెట్లో బియ్యం సరఫరాలు మరింత పెంచేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఓ వైపు కరువు, వరదల కారణంగా ఈ ఏడాదిలో వరి ఉత్పత్తిలో 16 మిలియన్ టన్నుల దాకా తగ్గుదల కనపడవచ్చని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బియ్యంపైనున్న సుంకాన్ని తగ్గించిందని అధికారులు పేర్కొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలను పెరగకుండా ఉండేందుకు బియ్యంపై దిగుమతి సుంకాన్ని తొలగించాల్సిందిగా గత నెలలో సాధికార మంత్రుల కమిటీ సిఫార్సు చేసిందని అధికారులు వివరించారు.