దేశీయ చమురు ఉత్పత్తి రంగంలో అగ్రగామిగానున్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) సంస్థ నష్టాలలో పయనిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి రూ. 136.68 కోట్ల నష్టాలను చవిచూసింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ సంస్థకు రూ. 3218.92 కోట్ల నష్టాలు వచ్చాయని హెచ్‌పీసీఎల్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
జులై-సెప్టెంబర్ 30 చివరి వరకు జరిగిన అమ్మకాల్లో రూ. 24456.62 కోట్ల వ్యాపారం జరిగింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 35513.99 కోట్ల వ్యాపారం జరిగినట్లు సంస్థ పేర్కొంది.