సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 31 శాతం లాభాలు పెంచుకున్న పిఎన్‌బీ (Banking Sector | PNB | September 30 | SQ | FY | Net Profit | Net Income)
Feedback Print Bookmark and Share
 
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి 31 శాతం నికర లాభాలను ఆర్జించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంక్ నికర లాభాలలో 31 శాతం వృద్ధి జరిగి రూ. 927 కోట్లకు చేరుకుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపామని బ్యాంక్‌కు కొత్తగా నియమించబడ్డ ఛైర్మెన్ కేఆర్. కామత్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బ్యాంక్ నికర ఆదాయం పెరిగి రూ. 6,075.86 కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి బ్యాంక్ నికర ఆదాయం రూ. 5,313.18 కోట్లుగా ఉండింది. అదే విధంగా వడ్డీల రూపంలో బ్యాంక్‌కు వచ్చిన ఆదాయం 16 శాతం పెరిగి రూ. 5,407 కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.