సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » హాంగ్‌కాంగ్‌లో ప్రారంభం కానున్న ఎత్తైన హోటల్ (Hotel Sector | Ritz carlton | World | Hongkong)
Feedback Print Bookmark and Share
 
అత్యాధునికమైన సౌకర్యాలతో కూడుకున్న హోటళ్ళ రంగంలో అగ్రగామిగానున్న "రిట్జ్ కాల్టన్" సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి హాంగ్‌కాంగ్‌లో 118 అంతస్తుల ఎత్తైన హోటల్‌ను ప్రారంభించనుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము హాంగ్‌కాంగ్‌లో కొత్తగా ప్రారంభించనున్న 118 అంతస్తుల ఎత్తైన హోటల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదని రిట్జ్ కాల్టన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఈ హోటల్ ఎత్తు 484 మీటర్ల ఎత్తున్న ప్రపంచ వాణిజ్య కేంద్రంకన్నా 17 అడుగుల ఎత్తుగా నిర్మించామని, ఇది ఆరు నక్షత్రాల హోటల్ అని (సిక్స్ స్టార్ హోటల్), ఇందులో 312 గదులుంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


హాంగ్‌కాంగ్‌లోని కోవులూన్ ప్రాంతంలోని విక్టోరియా ఓడరేవుపై నిర్మిస్తున్న ఈ హోటల్ పనులు చకచకా పూర్తవుతున్నాయని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం దుబాయ్‌లో 333 మీటర్ల ఎత్తు కలిగిన రోజ్ హోట్ల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్‌గా పేరుపొందింది. దీని తర్వాత ప్యోంగయాంగ్‌లోని హోటల్ 330 మీటర్లతో ప్రసిద్ధి చెందాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.