దేశంలో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతుండటంతో 17 అక్టోబర్‌తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం రేటు 0.30 శాతం పెరిగి 1.51 శాతానికి చేరుకుంది.
అదే దీనికి ముందు వారంలో ద్రవ్యోల్బణం రేటు 1.21 శాతంగా ఉండింది. అక్టోబర్ 17తో ముగిసిన వారానికి టీ, మాంసం, పప్పు ధాన్యాలు, బెల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాలు, నూనె ధరలు ఆకాశాన్నంటాయి.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అక్టోబర్ 27న భారత రిజర్వ్ బ్యాంక్ అనుమానం వ్యక్తం చేసింది.