దేశీయ సిమెంట్ నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న ఇండియా సిమెంట్స్ సంస్థ సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి రెండు శాతం నికర లాభాలు పెరిగి రూ. 136.94 కోట్లకు చేరుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు నికర లాభాలు రెండు శాతం పెరిగి రూ. 136.94 కోట్ల రూపాయలకు చేరుకుందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభాలు రూ. 134. 27 కోట్లుగా ఉండిందని ఇండియా సిమెంట్స్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
గడచిన త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ. 994.92 కోట్లకు చేరుకుందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 929.64 కోట్లుగా ఉండిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి కంపెనీ నికర లాభాలు రూ. 281.22 కోట్లుకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన నికర లాభాలతో పోలిస్తే ఇది 1.74 శాతం ఎక్కువని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వచ్చిన నికర ఆదాయం రూ. 1,955.17 కోట్లకు చేరుకుందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 1,805.88 కోట్లుగా ఉండిందని కంపెనీ తెలిపింది.