సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సెప్టెంబర్‌లో 14 శాతం తగ్గిన ఎగుమతులు (FY | SQ | September | Previous FY | Rahul Khuller | Export)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికాంతమైన సెప్టెంబర్ నెలలో దేశీయ ఎగుమతులు దాదాపు 13.8 శాతం తగ్గాయి. ఇలా వరుసగా 12వ నెలలోను ఎగుమతులు తగ్గాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

గడచిన సెప్టెంబర్ నెలలో జరిగిన ఎగుమతులలో 13.6 వందల కోట్ల డాలర్లుగా ఉండింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన ఎగుమతులు 15.8 వందల కోట్ల డాలర్లుగా ఉండిందని వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ తెలిపారు.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో ఎగుమతులు 28.5 శాతం తగ్గుముఖంపట్టి 77.9 వందల కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 108.9 వందల కోట్ల డాలర్లకు ఎగుమతులు జరిగాయి.

ఇదిలావుండగా మే నెలలో ఎగుమతుల్లో భారీ తగ్గుదల కనపడి 31.9 శాతానికి చేరుకుంది. అదే జులై నెలలో 28.4 శాతం, ఆగస్టులో జరిగిన ఎగుమతుల్లో ఇందులోనుంచి 19.5 శాతం తగ్గుముఖం పట్టింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.