సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » భారత వృద్ధి రేటు వేగంగా ఉంటుంది: ఐఎంఎఫ్ (IMF | growth rate | India | Asia | Private investments | demand)
Feedback Print Bookmark and Share
 
ఆర్థిక సంక్షోభం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాల్లో 2010లో భారత అత్యంత వేగంగా వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ నిధుల పర్యవేక్షణ సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ పరంగా తీసుకుంటే.. ఆసియాలోనే వేగవంతమైన వృద్ధి కనబడుతున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్.. అలాగే ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల వెరసి భారత ఆర్థిక వృద్ధి రేటును 6.5 శాతానికి చేర్చనున్నట్లు ఐఎంఎఫ్ వివరించింది. ప్రస్తుతం అక్కడ (భారత్‌లో) 5.33 శాతం ఉందని.. 2010లో ఇది 6.5 శాతానికి చేరవచ్చని తెలిపింది.

ఇస్లానబుల్‌లో ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ఆర్థిక దృక్పథంపై ఐఎంఎఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2009లో భారత వృద్ధి రేటు 5.4 శాతం ఉండేకు వీలుంది. అదలా ఉంచితే.. ఆసియా ఆర్థిక వ్యవస్థల ద్రవ్య, ఆర్థిక ఉద్ధీపన పథకాలు ఎంతో పటిష్ఠంగా రూపుదిద్దుకుని ఉన్నాయి.

ప్రత్యేకించి ఆసియా.. ఎగుమతులపై అధికంగా ఆధారపడి ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్థితిగతులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు.. దీని ప్రభావం.. ఆసియాపై దాని వృద్ధి రేటుపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఇలాంటి పరిణామాల పట్ల ఆసియా అత్యంత జాగ్రత వహించాల్సిందిగా హెచ్చరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.