సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెరగనున్న ముడి చమురు ధరలు: శర్మ (FY | SQ | Crude Oil | ONGC | MD | RSSarma | MMSCMD | Barrel)
Feedback Print Bookmark and Share
 
FILE
రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు పెరగనున్నాయని ఓఎన్‌జీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్.శర్మ తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ద్వితీయ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఓఎన్‌జీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్. శర్మ విలేకరులతో మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు పెరగనున్నాయని ఆయన వెల్లడించారు.

2015-16వ ఆర్థిక సంవత్సరం వరకు తమ సంస్థ ప్రతి రోజు వంద ఎమ్ఎమ్ఎస్‌సీఎమ్‌డీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుందని, ప్రస్తుతం కంపెనీ ప్రతిరోజు 62 ఎమ్ఎమ్ఎస్‌సీఎమ్‌డీ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ఇటీవలే ముడిచమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం ప్రతి బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. కాగా రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.