సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » లాభాలు పెంచుకున్న ఓఎన్‌జీసీ (Oil and Gas | Production | ONGC | SQ | FY | Net Plrofit | Net Income)
Feedback Print Bookmark and Share
 
ప్రభుత్వరంగానికి చెందిన చమురు, సహజ వాయువు ఉత్పత్తి సంస్థ అయిన ఓఎన్‌జీసీ సంస్థ సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి ఆరు శాతం లాభాలు పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి వచ్చిన నికర లాభాలు ఆరు శాతం పెరిగి రూ. 5,089.64 కోట్లకు చేరుకుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ లాభాలు దాదాపు రూ. 1,491 కోట్ల మేరకు తగ్గాయని, దీంతో రూ. 2,630 కోట్ల ఇంధనానన్ని సబ్సిడీగా ఇవ్వాల్సి వస్తోందని కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు వివరించింది.

తమ సంస్థ అమ్మకాలు, ఉత్పత్తులు, ధరల్లో తగ్గుదల కారణంగా రూ. 15,080.59 కోట్లు మాత్రమే వ్యాపారం జరిగింది. అదే ఇదివరకు జరిగిన అమ్మకాలు రూ. 17,407.40 కోట్లుగా ఉండింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఓఎన్‌జీసీకి వచ్చిన లాభాలు రూ. 9,937.56 కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 11,444.74 కోట్లుగా ఉండింది. ఇదిలావుండగా నిరుడు ఆగస్టులో ప్రతి బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లుగా ఉండింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.