ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పసిడి దిగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్ (Festival Season | September | Gold | Import | Tones | Durga Puja)
దేశంలో ఇటీవల పండుగల సీజన్ రావడంతో సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 72 శాతం పెరగి 37.5 టన్నులకు చేరుకుంది. అదే ఆగస్టు నెలలో 21.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు బొంబాయి బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత ఏడాది ఇటీవల వచ్చిన పండుగల నేపథ్యంలో దుర్గా పూజ, నవరాత్రి తర్వాత ధన్‌తేరస్, దీపావళి పండుగల సందర్భంగా బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో పసిడి దిగుమతులలో వృద్ధి జరిగినట్లు బొంబాయి బులియన్ అసోసియేన్ డైరెక్టర్ సురేష్ హుండియా తెలిపారు.
పండుగల సీజన్ పూర్తవడంతో అక్టోబర్ నెలలో బంగారం అమ్మకాలు తగ్గనున్నాయని, దీంతో పసిడి దిగుమతుల్లోను తగ్గుదల కనపడవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ధన్‌తేరస్ పండుగ సందర్భంగా బంగారం కొంటే శుభం జరుగుతుందని భావించి ఆ పండుగ సందర్భంగా బంగారం అమ్మకాలు పెరిగాయి. అక్టోబర్ 22 తర్వాత అమ్మకాలు తగ్గడంతో అతికష్టంమీద ఈ నెల చివరికి 27 టన్నులకుమించి దిగుమతులు చోటు చేసుకోకపోవచ్చని ఆయన తెలిపారు.