ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » నష్టాలను చవిచూసిన బీపీసీఎల్ (Oil Production | BPCL | Petroleum Products | Sales | Net Income | Net Profit | Loss)
దేశీయ చమురు ఉత్పత్తి కంపెనీ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి నష్టాలు చవిచూసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు రూ. 158.77 కోట్లు నష్టాలు సంభవించాయని భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ తెలిపింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఈ నష్టం రూ. 2625.27 కోట్లుగా ఉండిందని కంపెనీ శుక్రవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
ద్రితీయ త్రైమాసికాంతానికి తమ సంస్థకు వచ్చిన నికర ఆదాయంలోను తగ్గుదల కనపడిందని, అది రూ. 27513.40 కోట్లుగా ఉంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఆదాయం రూ. 38148.73 కోట్లుగా ఉండిందని, దీంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన ఆదాయం దాదాపు 27.87 శాతం తగ్గిందని కంపెనీ పేర్కొంది.