సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో సిండికేట్ బ్యాంక్ లాభాలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన లాభాలలో దాదాపు 32 శాతం తగ్గిందని, నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ బ్యాంక్‌కు రూ. 262 కోట్ల లాభాలు వచ్చాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన గత త్రైమాసికంలో రూ. 178 కోట్లు నికర లాభాలు వచ్చాయని సిండికేట్ బ్యాంక్ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.
నిరుడు ఇదే కాలానికి వచ్చిన లాభాలతో పోలిస్తే 32 శాతం తగ్గుముఖం పట్టిందని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్ నికర ఆదాయం రూ. 2,821 కోట్లకు చేరుకుందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 2,527 కోట్లుగా ఉండిందని బ్యాంక్ పేర్కొంది. దీంతో తమ నికర ఆదాయంలో 12 శాతం పెరుగుదల కనపడిందని బ్యాంక్ వివరించింది.