అమెరికా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి నిరుద్యోగులకు కొన్ని లక్షల ఉద్యోగాలను కల్పించనుంది.
ఒబామా ప్రభుత్వం అమెరికాలో ఈ ఏడాది ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీ విడుదల చేసిన తర్వాత కొత్తగా 640,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి తమ దేశంలోని నిరుద్యోగులకు 35 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నామని, ఇది నిరుద్యోగులకు ఎంతో ఊరట అని ఆయన అన్నారు. తాము కల్పించే ఉద్యోగాలు విద్యా, ఆరోగ్యం, వాతావరణ పరిశోధన సంస్థ తదితర విభాగాలో ఉంటాయని ఆయన వివరించారు.
ప్రస్తుతం తమ దేశంలో నిరుద్యోగుల శాతం 9.8గా ఉందని, ఇది వచ్చే ఇరవై అయిదు సంవత్సరాలనాటికి చేరుకుందని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో 787 వందల కోట్ల డాలర్లను ప్రోత్సాహక ప్యాకేజీగా అమెరికా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.
కాగా మిగిలిన ఉద్యోగాలు త్వరితగతిన భర్తీ చేసేందుకు ఒబామా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.