సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పునఃప్రారంభం కానున్న తాజ్‌ హోటల్ హెరిటేజ్ శాఖ (Last Year | November | Mumbai | Terrorists | Tajmahal Palace | Heritage Hotels)
Feedback Print Bookmark and Share
 
నిరుడు నవంబర్ ముంబైలో తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా దెబ్బతిన్న హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్‌కు చెందిన హెరిటేజ్ శాఖ అన్ని హంగులతో పునర్నిర్మితమై ప్రారంభానికి సిద్ధమైనట్లు సంస్థ తెలిపింది.

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హోటల్ తాజ్‍‌మహల్ ప్యాలెస్ హోటల్‌కు చెందిన హెరిటేజ్ శాఖ పనులు పూర్తయ్యాయని, దీనిని తాము నవంబర్-డిసెంబర్ మాసాలలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండియన్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ బిక్‌సన్ తెలిపారు.

హోటల్‍‌‌లోని మూడు రెస్టారెంట్లను త్వరలోనే ప్రారంభిస్తామని, నిరుడు ఉగ్రవాదుల చేతిలో పూర్తిగా ధ్వంసమైన తమ హోటల్‌ను పునర్నిర్మించామని, దీంతో దేశ విదేశాల వినియోగదారులు, పర్యాటకులు తమ హోటల్‌ను గతంలోలాగా సందర్శించవచ్చని, ఇకపై తాము గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.