ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » లాభాల బాటలో జాగూర్ ల్యాండ్ రోవర్ (India | Automobile Sector | TATA Motors | Luxury Car | Jaguar Land Rover)
భారతీయ ఆటోమొబైల్ రంగానికి చెందిన టాటా మోటార్స్ సంస్థ వారి లగ్జరీ కార్ల బ్రాండ్ జాగూర్ ల్యాండ్ రోవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలను ఆర్జిస్తోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికాంతానికి గణీయమైన లాభాలను ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి 12.7% వృద్ధిని నమోదు చేసిందని జాగూర్ కంపెనీ వర్గాలు తెలిపాయి.
పన్ను చెల్లించడానికి ముందు తమ లాభాలు 153% శాతం పెరిగి రూ. 906.85 కోట్లు (1.2 బిలియన్ యూరోలు)కు చేరుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నడుస్తున్న ఈ సమయంలో కూడా తమ కంపెనీ లాభాల బాటన నడవడం ఆనందంగా వుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.