కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సౌదీ అరబ్ ఆర్థిక మంత్రి ఇబ్రహీం బిన్ అబ్దుల్ అజీజ్ అల్ అసఫ్, విదేశాంగ శాఖామంత్రి ప్రిన్స్ సౌద్ అల్ ఫైజల్‌తో భేటీ అయ్యారు.
భారత్, సౌదీ అరబ్ దేశాల మధ్య ఆర్థికపరమైన అంశాలు మెరుగుపరచుకోవాలని, ఇరుదేశాల సంబంధ బాంధ్యవ్యాలను పటిష్టపరచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ సౌదీ అరబ్ ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రులను కలిసి సూచించారు.
సౌదీ-భారతీయ సంయుక్త సమితిలో పాల్గొనేందుకు సౌదీ వచ్చిన ప్రణబ్ అధ్యక్షతన ప్రతినిధి మండలి ఇప్పుడు సౌదీ అరబ్‌లో పర్యటిస్తోంది.
ఈ సందర్భంగా సౌదీరాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ప్రణబ్ ముఖర్జీని తన నివాసానికి ఆహ్వానించినట్లు అధికారిక సమాచారం.
సౌదీ-భారతీయ సంయుక్త సమితిలో నిర్వహించిన చర్చల్లో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపరచుకునేందుకు, ఆర్థికపరమైన అంశాలను ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలని ప్రణబ్ ఆ దేశ విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రులకు సూచించారని సౌదీ అరబ్ అధికార వర్గాలు వెల్లడించాయి.