సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 9 శాతం పెరిగిన జెట్ ఫ్యూయెల్ ధరలు (International Crude Oil Market | Price | ATF | Flight | IOC | BPCL | HPCL)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ చమురు కంపెనీలు విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ధరలను 9 శాతం పెంచాయి.

ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయ చమురు కంపెనీలు విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ధరలను 9 శాతానికి పెంచి ప్రతి కిలో లీటరుకు రూ. 39,000లు చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.

శనివారం అర్ధరాత్రినుంచి ఏటీఎఫ్ ధరలు ప్రతి కిలో లీటరుకు రూ. 3,400లకు చేరుకున్నాయని, గతంలో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో ధరలు తగ్గడంతో ఐఓసీ, భారత పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు గత మూడు పక్షాలుగా ఏటీఎఫ్ ధరలను తగ్గించాయని అధికారులు పేర్కొన్నారు.

అప్పుడు డాలర్ పరిస్థితి క్షీణించడంతో రూపాయి విలువలో మార్పులు సభవించడంతో పై సంస్థలు ధరలు తగ్గించాయని, దీంతో ఏటీఎఫ్ ధరలు ప్రతి కిలో లీటరుకు రూ. 36,188.27లుగా ఉన్నాయని వారు అన్నారు.

అదే సెప్టెంబర్ ప్రారంభంలో ప్రతి కిలో లీటరు ధర రూ. 39,188లకు చేరుకుంది. ఈ రోజు పెరిగి ధరలతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో పెరిగిన ధరలతో సమానమైందని అధికారులు వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.