సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » వడ్డీ రేట్లను సవరించిన లక్ష్మీ విలాస్ బ్యాంకు (Interest Rates | Revises | LVB | Term Deposits | Maturity | Regular | Business)
Feedback Print Bookmark and Share
 
ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన లక్ష్మీ విలాస్ బ్యాంకు మరోమారు దేశవాళీ డిపాజిట్లకు చెల్లించే వడ్డీ రేట్లను సవరించింది. ఐదు సంవత్సరాల పైబడి ఉండే డిపాజిట్లపై ఒక్క శాతం మేరకు కోత విధిస్తున్నట్టు ఆ బ్యాంకు అధికారులు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎల్.వి.బి. ఐదు సంవత్సరాల పైబడి కాలపరితితో ఉండే రెగ్యులర్ డిపాజిట్లకు 8.25 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్స్‌కు 9 శాతం వడ్డీని అందజేస్తోంది. ఈ వడ్డీలో ఒక శాతం కోత విధించింది.

ఆ ప్రకారంగా దేశవాళీ రెగ్యులర్ డిపాజిట్లపై 7.25 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు ఎనిమిది శాతం చొప్పున వడ్డీని చెల్లించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ మార్పు నవంబరు రెండో తేదీ నుంచి అమలుకు వచ్చినట్టు బ్యాంకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మిగిలిన డిపాజిట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.