ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమ్మకాల్లో వృద్ధి సాధించిన యమహా (Two Wheelers | Production | Yamaha Motors | October | Sales | MD | Yukimine Tsuji)
దేశీయ ద్విచక్ర వాహననాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న యమహా మోటార్స్ సంస్థకు చెందిన వాహనాలు అక్టోబర్ నెలలో 44.40 శాతం అమ్మకాలు కొనసాగించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్‌లో తమ వాహనాల అమ్మకాల్లో 44.40 శాతం వృద్ధిచెంది 26,879 వాహనాలు అమ్ముడుపోయినట్లు యమహా కంపెనీ ప్రధాన కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ యూకీమినే సూజీ తెలిపారు.
అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ సంస్థకు చెందిన ద్విచక్ర వాహానాల అమ్మకాలు 18,614గా ఉన్నాయని, దీంతో పోలిస్తే ప్రస్తుతం 44.40 శాతం వృద్ధి చెందిందని ఆయన వివరించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త మోడళ్ళ వాహనాలు ఎఫ్‌జెడ్ 16, ఫేజర్, ఆర్ 15పట్ల తమ వినియోగదారుల నమ్మకం పెరిగిందని, దీంతో తమ వాహనాలు అత్యధిక సంఖ్యలో అమ్ముడైనట్లు ఆయన వివరించారు.
ఎఫ్‌జెడ్ ఎస్, ఎఫ్‌జెడ్ 16, ఫేజర్ వాహనాలను సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసామని, దీంతో వినియోగదారుల నమ్మకం పెరిగిందని ఆయన వెల్లడించారు.
దీంతోపాటు గత నెలలో పండుగల వాతావరణం కావడంతో తమ వాహనాలు అత్యధిక సంఖ్యలో అమ్ముడైనాయని, దీంతో తమ సంస్థ తమ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.