సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పాల ఆధారిత డ్రింక్‌ను ప్రవేశపెట్టిన బ్రిటానియా (Britania | Actimind | Vinita Bali | MD | Child | Vitamins | Metntal)
Feedback Print Bookmark and Share
 
Srini
WD
బిస్కట్ల వ్యాపార రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న బ్రిటానియా సంస్థ తాజాగా మార్కెట్‌లో పాల ఆధారిత డ్రింక్‌ను విడుదల చేసింది. ఏడు యాక్టిbd బ్రైన్ న్యూట్రిషన్స్ కలిగిన ఈ పానీయం 150 మిల్లీలీటర్ బాటిల్‌లో ప్రవేశపెట్టినట్టు ఆ సంస్థ పేర్కొంది. దీనిపై బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ వినితా బాలి మాట్లాడుతూ.. తాము మార్కెట్‌లోకి తొలిసారి ప్రవేశపెట్టిన పాల ఆధారిత యాక్టిమైండ్ డ్రింక్‌కు చిన్నారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

దీని తయారీ కోసం పలు దశల్లో పరిశోధనలు చేసినట్టు చెప్పారు. ఈ డ్రింక్‌ను తొలిసారి తమిళనాడు రాష్ట్రంలోనే విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, సేలం, చెన్నయ్ వంటి ప్రధాన నగరాల్లోనే ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Srini
WD
ఈ యాక్టిమైండ్‌ ఏడు న్యూట్రిషన్ గుణగణాలు కలిగి ఉందని చెప్పారు. ప్రధానంగా ఇందులో ఉండే 5బి విటమిన్.. మెదడును నిరంతరం యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందన్నారు.


అలాగే కొలిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుందని, అయోడిన్ మానసిక స్థితిని అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రతి రోజూ చిన్నారికి అందించే ఇతర న్యూట్రిషన్స్ కంటే.. 20 శాతం ఎక్కువగానే ఇందులో పోషకాలు ఉంటాయని వినితా బాలి తెలిపారు. 150 ఎంఎల్ బాటిల్ ధర రూ.15గా నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. కాగా, బ్రిటానియా సంస్థ టర్నోవర్ రూ.1800 కోట్లని ఆమె వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.