ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకోవచ్చు: ప్రణాళికా సంఘం (Economy | GDP growth | Planning Commission | Current financial year | Eleventh Finance Commission)
ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకోవచ్చు: ప్రణాళికా సంఘం
మంగళవారం, 3 నవంబర్ 2009( 14:27 IST )
వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక వృద్ధి 6.3 శాతం నుంచి 8 శాతానికి చేరుకోవచ్చని ప్రణాళికా సంఘం భావిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్థిక వృద్ధి 6.3 శాతానికి చేరుకుంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెంది 8 శాతానికి ఎగబాకుతుందని ప్రణాళికా సంఘం తాజా నివేదికలో పేర్కొంది.
ఇది అలాగే 2011-12లో 9 శాతానికి చేరుకుని 2014-15వ ఆర్థిక సంవత్సరానికి 10 శాతానికి చేరుకుంటుందని ఇటీవల ఏర్పడిన 11వ ఆర్థిక ప్రణాళికా సంఘం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా నిరుడు 9 శాతం ఆర్థిక వృద్ధి నుంచి 6.7 శాతానికి చేరుకుందని ఇదే తగ్గుదల మరింత తగ్గి 6.3 శాతానికి చేరుకుందని ప్రణాళికా సంఘం తెలిపింది.
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 6.1 శాతానికి పడిపోయి, మళ్ళీ ద్వితీయ త్రైమాసికంలో వృద్ధి చెందింది.