సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సిఆర్-విని మార్కెట్లోకి విడుదల చేసిన హోండా (Luxury car | Honda Siel Cars India | Sports utility vehicle | Honda CRV)
Feedback Print Bookmark and Share
 
లగ్జరీ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న హోండా సియేల్ కార్ల కంపెనీ మంగళవారం కొత్త స్పోర్ట్స్ వాహనమైన CR-Vని మార్కెట్లోకి విడుదల చేసింది.

స్పోర్ట్స్ వాహనమైన CR-V వాహనాన్ని కొత్త హంగులతో రూపొందించి మంగళవారం నాడు ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేసినట్లు హోండా సియేల్ కార్స్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) తాత్సుయా నాత్సుమే తెలిపారు.

తాము మార్కెట్లో ప్రవేశ పెట్టిన కొత్త వాహనం CR-V మూడు వేరియంట్స్‌లో లభ్యమౌతుందని. దీని సామర్థ్యం 2.0-2.4 లీటర్లుగా ఉంటుందని, వీటి ఎక్స్ షోరూం ధర రూ. 21.9 నుంచి 24.12 లక్షలుగా ఉంటుందని ఆయన వివరించారు.

దేశంలో తమ సంస్థపట్ల పెరుగుతున్న ఆదరణనుబట్టి తాము మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

భారత దేశంలో తమ కంపెనీ 2003లో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 12,500 ఎస్‌యూవీ వాహనాలను అమ్మినట్లు ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.