బంగారం ధరలు మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రతి పది గ్రాముల బంగారం ధర రూ. 16,254లకు చేరుకుందని మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ తెలిపింది.
ఎమ్‌సీఎక్స్‌లో బంగారం గడచిన ఫిబ్రవరితో పోలిస్తే 0.75 శాతం పెరిగింది. రూ. 109లు ఎగబాకి ప్రతి పదిగ్రాములు రూ. 16,254లకు చేరుకుంది.
ఇదేవిధంగా బంగారం వచ్చే డిసెంబర్‌లో మార్కెట్లోకి వచ్చే బంగారంలోను 0.73 శాతం వృద్ధితో రూ. 16,248లకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.