ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఉద్యోగులను తొలగించనున్న జాన్సన్ అండ్ జాన్సన్ (Health Care Products | jonson and jonson | Employees | Unemployment | Production)
ఆరోగ్యరంగానికి సంబంధించిన ఉత్పత్తుల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచవ్యాప్తంగానున్న తన సంస్థలోని ఉద్యోగులలో 8,190 మందికి ఉద్వాసన పలకనుంది.
ప్రపంచవ్యాప్తంగానున్న తమ సంస్థలోని ఉద్యోగులలో దాదాపు 8,190 మందిని తొలగించనున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,17,000 మంది ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది.
తమ సంస్థలోని ఉద్యోగులలో దాదాపు 6.7 శాతం ఉద్యోగులను తొలగించనున్నామని దీంతో సంస్థకు చెందిన ఉద్యోగులు దాదాపు 8,190 మంది నిరుద్యోగబాట పట్టనున్నారని సంస్థ పేర్కొంది.