సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రేంజ్ రోవర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ (Vehicles | Production | TATA Motors | Capital | Delhi | Mumbai | Range rover india)
Feedback Print Bookmark and Share
 
దేశీయ అతిపెద్ద వాహన నిర్మాణ కంపెనీ అయిన టాటా మోటార్స్ సంస్థ దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాడు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన (ఎస్‌యూవీ) రేంజ్ రోవర్ మోడల్ 2010ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) రేంజ్ రోవర్ మోడల్ 2010ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. ముంబైలో ఎక్స్ షో రూం ధర రూ. 98.5 లక్షలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

తాము ప్రవేశపెట్టిన కొత్త మోడల్ ఎస్‌యూవీలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ ల్యాండ్ రోవర్ కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఏర్పాటు చేసామని కంపెనీ తెలిపింది. ఇందులో అత్యాధునికమైన, అతి శక్తివంతమైన ఇంజన్, ఇంటీరియర్ డెకొరేషన్, డ్రైవింగ్ డైనమిక్స్‌ను పొందుపరిచామని కంపెనీ వివరించింది.

ఇదిలావుండగా నిరుడు టాటా మోటార్స్ సంస్త అమెరికా వాహనాల నిర్మాణ సంస్థ ఫోర్డ్ మోటర్ సంస్థ నుండి జేఎల్ఆర్‌ను దాదాపు 2.3 వందల కోట్ల డాలర్లతో కొనింది.

కాగా టాటా సంస్థ రానున్న రోజుల్లో జాగువార్ ల్యాండ్ రోవర్ సంస్థ నుంచి విభిన్న మోడళ్ళను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు నిరుడు ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికలో రతన్ టాటా వెల్లడించారు. వీటిలో హైబ్రిడ్ మోడల్ కూడా పొందుపరచబడివుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.