సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రూ.200 కోట్ల ఆదాయ అర్జనపై కన్నేసిన ఎల్జీ! (Income | LG Electronics | Chennai | Turnover | Business | Computers | Desktops)
Feedback Print Bookmark and Share
 
Srini
WD
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా ఉన్న ఎల్.జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చే 2010 సంవత్సరాంతానికి 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ బిజినెస్ గ్రూపు, బిజినెస్ సొల్యూషన్ మార్కెటింగ్ హెడ్ ఆర్.మణికంఠన్ బుధవారం చెన్నయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ... ఈ సంస్థ తాజాగా టచ్ స్క్రీన్‌తో కూడిన కంప్యూటర్ మానిటర్లు, పీసీలు, డెస్క్‌టాప్ పీసీలను ఉత్పత్తి చేసి, దేశ వ్యాప్తంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వస్తు ఉత్పత్తిని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసినట్టు చెప్పారు. తమ సంస్థ నుంచి ఉత్పత్తి చేసిన ఒక డెస్క్‌టాప్ పీసీ నుంచి ఏకకాలంలో 11 మంది కంప్యూటర్ యూజర్స్‌ను పర్యవేక్షించవచ్చన్నారు.

అలాగే, టచ్‌స్క్రీన్ సౌలభ్యం కలిగిన కంప్యూటర్ బ్లాక్‌బోర్డులాంటి ఇ బోర్డులను సంస్థ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా నానాటికీ అభవృద్ధి చెందుతున్న హైటెక్ టెక్నాలజీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. ప్రధానంగా ఐటీ సొల్యూషన్స్ ద్వారా దేశ విద్యా రంగంలో తమ వస్తు వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు.

విద్యారంగంలో వివిధ రకాలుగా తమ వస్తువులు ఉపయోగపడతాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ కంపెనీ ఉత్పత్తి చేసిన నెట్‌వర్క్ మానిటర్లు తక్కువ ఖర్చుతో పాటు.. ఏకకాలంలో 11 మంది పీసీ యూజర్స్‌ను పర్యవేక్షించవచ్చని వచ్చని మణికంఠన్ వివరించారు. ఇకపోతే.. తమ వ్యాపార కార్యకలాపాలు, వృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. 2010 నాటికి 200 కోట్ల రూపాయలను ఆదాయంగా అర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

వచ్చే యేడాది ఆఖరుకు రెండు లక్షల యూనిట్లను విక్రయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తమ కంప్యూటర్ల తయారీకి
Srini
WD
అవసరమైన విడిభాగాలను నోయిడాలోని తమ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తుండగా, మరికొన్నింటిని హాంకాంగ్, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి, పరిశోధన కోసం సంవత్సరానికి రూ.200 కోట్లను ఖర్చు చేసినట్టు చెప్పారు.


భవిష్యత్‌లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తామన్నారు. 2010 సంవత్సరానికి తమ మార్కెట్ 20 శాతంగా ఉంటుందని, 2011 నాటికి ఇది 30 శాతానికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు. బిజినెస్ సొల్యూషన్ రంగంలో తమ మార్కెటింగ్ పెట్టుబడులు ఆరు మిలియన్లుగా ఉన్నట్టు మణికంఠన్ వివరించారు. 2008లో ఎల్జీ టర్నోవర్ రూ.10730 కోట్లు కాగా, 2009 సంవత్సరంలో ఇది 13000 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.