సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆకాశాన్నంటిన బంగారం ధరలు (Price | International Bullion Market | Wednes Day | Gold | Silver)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో దేశంలోని బంగారం ధరలు ఆకాశాన్నంటాయి.

ప్రపంచ వాణిజ్య మార్కెట్లో ప్రతి ఔన్స్ బంగారం బుధవారం నాడు ధర 1,091 డాలర్లకు చేరుకుంది. దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే బంగారం ధర రూ. 350, వెండి ధర రూ. 700లకు ఎగబాకింది.

అలాగే 24 క్యారెట్ల బంగారం ప్రతి పది గ్రాముల ధర రూ. 16,750లకు చేరుకుంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర ప్రతి పది గ్రాములు రూ. 16,430లకు చేరుకుంది. వెండి కిలో ధర రూ. 27,400లకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.