విజయ్‌మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ త్వరలో వంద మంది పైలెట్లు తొలగించే యోచన చేస్తోంది. దాదాపు శిక్షణ పూర్తి చేసుకుని ఇక విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారినంతా.. దాదాపు తొలగించాలని కింగ్‌ఫిషర్ చూస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
భారీ నష్టాల నుంచి తేరుకునేందుకు మరియు సామర్థ్యాన్ని కుదించడంలో భాగంగా కింగ్‌ఫిషర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పైలెట్లకు శిక్షణ పూర్తిగా ముగిసినప్పటికీ, వారి సర్వీసు కాంట్రాక్టులను పొడిగించడంపై ప్రస్తుతం యోచన చేస్తోంది. వీరందరినీ తొలగించాలా.. లేక.. కొనసాగించాలా అనే విషయాన్ని ప్రధానం చూస్తోంది.
ఇటీవల కాలంలో ప్రయాణీకుల రాకపోకలు తగ్గాయి... దీనికి తోడు.. ఇంధన ధరలు పైపైకి వెళ్లిపోతున్నాయి... అలాగే మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో.. కింగ్‌పిషర్ శిక్షణ పూర్తి చేసుకున్న పైలెట్ల సర్వీస్ అగ్రిమెంట్‌ను మళ్లీ రెన్యువల్ చేసుకోకూడదని చూస్తోంది.
అయితే దశల వారీగా.. వీరిని తొలగింపులు ఉండే అవకాశాలున్నట్లు కింగ్‌ఫిషర్ కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పైలెట్ల తొలగింపు కన్నా ముందుగా.. వారి జీతభత్యాల్లో 80 శాతం మేరకు కోతలు విధించాలని కింగ్‌ఫిషర్ ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించాయి.
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. కింగ్‌ఫిషర్ రూ. 418.77 కోట్లు మేరకు నష్టపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే.. కార్యకలాపాలు నుంచి వచ్చే ఆదాయం కూడా 13.6 శాతం మేరకు క్షీణించింది.