ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » రెండు నెలల్లో తగ్గనున్న ఉల్లిపాయల ధరలు (Onions | Export | Market | Minister | Sarad Pawar | Economic Editors)
ప్రస్తుతం దేశంలో ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయలను ఎగుమతి చేసేందుకు నిరాకరించింది. దీంతో దేశంలో వీటి ధరలు వచ్చే జనవరి నెలలో తగ్గనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో ఉల్లి ధరలు ఇక రానున్న రెండు నెలల్లో తగ్గనుందని, దేశీయ ఉల్లిపాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం నిరాకరించిందని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ అన్నారు.
ఎకనామిక్ ఎడిటర్స్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో పెరిగిన ఉల్లిపాయల ధరలు జనవరి నెల నాటికి తగ్గనున్నాయని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపాయలపై నిషేధం విధించిందని ఆయన తెలిపారు.
విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉల్లిపాయల ధరలు ప్రతి టన్నుకు 145 డాలర్లుగా ఉందని, దీంతో దేశంలోని ఉల్లిపాయల వ్యాపారస్తులు విదేశాలకు ఎగుమతి చేయడంతో దేశంలో వీటి ధరలు ఆకాశాన్నంటాయని ఆయన వివరంచారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశీయ ఉల్లిపాయలు విదేశాలకు 9.91 లక్షల టన్నులను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు.