ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మీ "రుచి" తెలుపండి.. రూ.50 లక్షలు గెలుచుకోండి! (Lay’s | launches | mega | consumer | engagement | program | Pepsico)
మీకు ఇష్టమైన సువాసన/రుచిని తెలియజేయండి. యాభై లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోండి అనే నినాదంతో పెప్సికో ఇండియా (ఫ్రిటో లే ఇండియా డివిజన్) సంస్థ తయారు చేసే లేస్ ఉత్పత్తులపై ఓ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఈ సంస్థ నుంచి ఉత్పత్తి చేసే లేస్ చిప్స్‌ను ఆరగించి, అందులో మీకు ఇష్టమైన రుచి/సువాసనను ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా తెలియజేయాల్సి వుంది. దేశ వ్యాప్తంగా ఉండే ప్రజలు ఈ కాన్సెప్ట్‌లో పాల్గొనవచ్చు.
దీనిపై పెప్సికో ఇండియా (ఫ్రిటో లే ఇండియా డివిజన్) వైస్ ప్రెసిడెంట్ రుచిరా జైట్లీ గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు వివిధ రుచులు/సువాసనలు ఇష్టపడుతారని, అందువల్ల తాము చేపట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్‌కు మంచి స్పందన లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు ముందుకు వచ్చి తాము ఇష్టపడే రుచి/సువాసన తెలియజేయాలని కోరారు. దేశ ప్రజలు ఎక్కువగా ఏ ఫ్లేవర్‌ను ఇష్టపడుతారో తెలుసుకోవాలనే ఆసక్తి మరికొద్ది రోజుల్లో తేలనుందన్నారు. జేడబ్ల్యూటీ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్
Srini
WD
డైరక్టర్ అంజు చౌహాన్ మాట్లాడుతూ.. తనకు ఏ రుచి/సువాసన ఇష్టమో తెలిపాను. అలాగే దేశ ప్రజలు కూడా తమకు ఇష్టమైన సువాసన ఒకటి ఉంటుందన్నారు.
నిజంగా ఇలాంటి ప్రచారం ఏవిధంగా సాగుతుందో నాకే ఆతృతగా ఉంది. దీన్ని మూడు దశలుగా చేపడుతున్నట్టు తెలిపారు. లేస్ చిప్స్‌ను ఆరగించే వినియోగదారులు తమ ఎంట్రీలను నవంబరు 2009 నుంచి జనవరి 2010 వరకు పంపాలన్నారు. ఈ ఎంట్రీలలో అత్యధికంగా ఇష్టపడే నాలుగు రుచులను విజేతగా ప్రత్యేక ప్యానెల్ ఎంపిక చేస్తుందన్నారు.
రెండో దశలో ఈ నాలుగు రుచులతో ప్రచారం చేసి వీటిలో ఎక్కువగా ఇష్టపడిన రుచి/సువాసను చివరి దశలో విజేతగా ప్రకటిస్తామన్నారు. ఈ విజేతకు రూ.50 లక్షలతో పాటు.. ఆ సువాసనకు సంబంధించిన లేస్‌ల విక్రయ టర్నోవర్‌లో ఒక శాతాన్ని అందజేస్తామన్నారు.