ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సెజ్‌ల నుంచి 15 శాతం పెరిగిన ఎగుమతులు (SEZ | Export | New Delhi | Special Economic Zones | Thursday | DK Mittal | Additional Secretary | Commerce Ministry)
దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(ఎస్ఈజెడ్) సెజ్‌ల నుండి ఎగుమతులు 15 శాతం పెరిగినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
నిరుడు ఆర్థిక సంవత్సరంకన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సెజ్‌ల నుండి జరిగిన ఎగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వ అదనపు కార్యదర్శి డికె. మిట్టల్ గురువారం సాయంత్రం తెలిపారు.
నిరుడు జరిగిన ఉత్పత్తుల్లో ఎగుమతుల వ్యాపారం రూ. 99,689 కోట్లకు చేరుకుందని, దీంతో మొత్తం మీద 15 శాతం అభివృద్ధి జరిగిందని ఆయన వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాతాన్ని వృద్ధి చేసేందుకు దేశీయ సెజ్‌లు పోటీ పడుతున్నాయని, దీంతో వ్యాపారాభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. .
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ. 1,01,264 కోట్లకు ఎగుమతులు జరిగాయని, ఇది మరింత పెరగవచ్చని ఆయన తెలిపారు.
ముఖ్యంగా జామ్‌నగర్‌లోనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచే ఎక్కువ ఎగుమతులు జరిగాయని, అలాగే జెమ్స్, నగలు, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, టెలికమ్యునికేషన్ తదితర రంగాలకు చెందిన వస్తువులను ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి 578 సెజ్‌లు ప్రభుత్వ అనుమతికి వచ్చాయని, వీటిలో 147 సెజ్‌లకు అనుమతినిచ్చామని, మరో 340 కంపెనీలను గుర్తించారు. వీటిలో 101 కంపెనీలు నిర్మాణదశలోవున్నాయి. దేశంలోనున్న సెజ్‌లపై పెట్టుబడి సెప్టెంబర్ నెల నాటికి రూ. 1,29,985.52 కోట్లు.
కాగా ఈ సెజ్‌లలో సెప్టెంబర్ 30 వరకు 4,18,129 మంది కార్మికులు ఉద్యోగాలు పొందారు.