బంగారం భగభగ

గురువారం, 5 నవంబర్ 2009( 19:39 IST )
భారతదేశం ఇటీవల ఐఎంఎఫ్ ద్వారా బంగారం కొనడంతో ఢిల్లీలోని సర్రాఫా మార్కెట్లో గురువారం రూ. 50లు పెరిగి ప్రతి పదిగ్రాముల ధర రూ. 16850లకు చేరుకుంది. ఇలా వరుసగా మూడో రోజుకు బంగారం ధరలు పైకి ఎగబాకాయి.
రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలుండటంతో బంగారం ధరలు పైకి ఎగబాకాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
న్యూయార్క్ మెటల్ ఎక్స్‌ఛేంజ్‌లో బంగారం బుధవారం రాత్రికి ప్రతి ఔన్స్ ధర 1099 డాలర్లకు చేరుకుని రికార్డు సృష్టించింది.
ఐఎంఎఫ్ నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనడంతో స్థానిక మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో స్టాండర్డ్ బంగారం అలాగే 22క్యారెట్ల బంగారం ప్రతి గ్రాముకు రూ. 50లకు పెరిగి ప్రతి పదిగ్రాముల ధర రూ. 16850లకు చేరుకుంది.
అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ప్రతి కిలో వెండి ధర రూ. 300లు పెరిగి రూ. 27500లకు చేరుకుంది.