ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణమూ పెరుగుతోంది. ప్రభుత్వమేమో చర్యలు తీసుకున్నామంటోంది. ధరల నియంత్రణకు తీవ్రంగా కృష్టి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా వెల్లడించారు. ఏదేమైనప్పటికీ.. సామాన్యుడు మాత్రం విలవిలలాడుతున్నాడు.
ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటం.. దీంతో.. అక్టోబర్ 24తో ముగిసిన వారంలో ఆహార వస్తువుల ధరల పెరుగుదల 13.39 శాతానికి చేరుకుంది. ప్రత్యేకించి ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు భారీగా పెరిగాయి. దీని వల్లే ఆహార ద్రవ్యోల్బణం పెరిగినట్లుగా తెలుస్తోంది.
ఉల్లిపాయల ధరలు 50 శాతం పెరగగా.. బంగాళాదుంపల ధరలు అంతకుఅంత పెరిగాయి. తృణధాన్యాలు, కాయధాన్యాల ధరలు దాదాపు 23.45 శాతానికి చేరుకున్నాయి. అయితే.. గతంలో.. ఇంధన, విద్యుత్ సూచీని పోల్చితే 62 శాతం మేరకు క్షీణించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు.. ఇక నుంచి నెల వారీగా ధరల సమాచారాన్ని అందించే విధాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా వెల్లడించాల్సిన.. టోకుల ధరల సూచీ (డబ్ల్యూపీఐ) వివరాలను ఆ శాఖ ప్రకటించలేదు. ప్రతి వారం ప్రాథమిక వస్తువులతో పాటు ఇంధన పెరుగుదల సమచారాన్ని కూడా కొత్త విధానం ద్వారా తెలియజేసేందుకు ప్రణాళిక చేసినట్లు ఆ శాఖ తెలిపింది.