దేశీయ విమానయాన కంపనీలైన జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు రవాణా చార్జీలను పెంచాయి.
తాము దేశీయ ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నట్లు దేశీయ విమానయాన కంపనీలైన జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడంతో తాము ఆ భర్తీని ప్రయాణీకులపై వేయక తప్పలేదని కింగ్‌ఫిషర్ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా రూ. 200ల వరకు పెంచామని రెండు సంస్థలు తెలిపాయి.
తాము పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని, ప్రతి వెయ్యి కిలోమీటర్లలోపు ప్రయాణించే వారికి రూ. 100లు పెంచామని, అదే వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసేవారికి రూ. 200ల మేరకు పెంచామని కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ అధికారులు తెలిపారు.
జెట్ ఎయిర్‌వేస్, జెట్ లైట్, జెట్ కనెక్ట్‌కు చెందిన అన్ని విమానాల చార్జీలను పెంచామని, ఇది రూ. 200ల మేరకు వుంటుందని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ తెలిపింది.
ఇదిలావుండగా స్పైస్ జెట్ సంస్థ కూడా చార్జీలను పెంచే ఆలోచనలోనున్నట్లు సమాచారం.