ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అమెరికా నిరుద్యోగ రేటు: 26 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి (America Jobless rate | 26 Years high | Financial turmoil)
అమెరికా నిరుద్యోగ రేటు: 26 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి
ఆర్థిక మాంద్యం సమయంలో దాని ప్రభావం అంతగా తెలియకపోయినా.. అది ముగిసిన తర్వాత ఇప్పుడు రికవరీ దశ వచ్చింది. ఈ సమయంలో.. దాని ప్రభావ ఫలితాలు అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఆ దేశ నిరుద్యోగ రేటు పర్వతంలా.. పెరిగిపోతూనే ఉంది మరి.
మరి కొద్ది నెలల్లో అమెరికాలో ఎనలేని ఉద్యోగాలను సృష్టిస్తామంటూ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా వెల్లడించినప్పటికీ.. ప్రస్తుతం అక్కడి పరిస్థితి దయనీయ స్థితికి చేరుకుంటోంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం అక్టోబర్ నెలాఖరు నాటికి 26 సంవత్సరాల గరిష్ఠ స్థాయిని చేరుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన అమెరికాలో ఇటీవల కాలంలో.. 1,90,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ప్రత్యేకించి నిర్మాణ, ఉత్పత్తి, రీటైల్ రంగాల్లోనే ఈ ఉద్యోగాల్లో కోతలున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో.. నిరుద్యోగుల సంఖ్య 5,58,000 నుంచి 15.7 మిలియన్‌లకు చేరుకుంది.
గతంలో 0.4 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు అక్టోబర్ నెలాఖరు నాటికి పర్వతంలా పెరిగి 10.2 శాతానికి చేరుకునేసింది. 1983 ఏప్రిల్ తర్వాత అంతటి స్థాయిలో నిరుద్యోగ రేటు ఏర్పడటం ఇదే తొలిసారి. అలాగే 80 ఏళ్లలో ఆర్థిక మాంద్యానికి అతలాకుతలం అవడం అమెరికాకు ఇదే తొలిసారి. 2007, డిసెంబర్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత.. అమెరికాలో నిరుద్యోగ రేటు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు 8.2 మిలియన్‌ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లుగా సమాచారం.
ఇటీవల ముగిసిన మూడు నెలల కాలంలో.. 1,88,000 మంది ఉద్యోగాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. ఇదంతా ఒకెత్తయితే... ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మందికి ఇప్పిటేకే.. సంబంధిత కంపెనీలు నోటీసులు కూడా ఇచ్చాయి. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే...