సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » డిపాజిట్ రేట్లను కుదించిన స్టేట్ బ్యాంక్ (State Bank Of India | Deposit interest rates | special home rate scheme)
Feedback Print Bookmark and Share
 
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్ వడ్డీ రేట్లను కుదించింది. ఈ తగ్గించిన డిపాజిట్ వడ్డీ రేట్లు నవంబర్ 9వ తేదీ నుంచి అమలులోకి తేనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం డిపాజిట్ రేట్లను 0.25 నుంచి 0.5 శాతం మేరకు తగ్గించనున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. ఇప్పుడది.. 5.25 శాతానికి తగ్గించినట్లు ఎస్‌బీఐ వివరించింది. మరోవైపు.. గృహరుణ పథకాన్ని ఎస్‌బీఐ మరింతగా విస్తరించింది. ఈ పథకానికి మార్కెట్ నుంచి మంచి స్పందన రావడంతో.. 2010, మార్చి 31వ తేదీ వరకు 8 శాతం మేరకు ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎస్‌బీఐ విస్తరించింది.

'మై హోం క్యాంపేన్' కింద ఈ ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది. దీని ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలపరిమితి కలిగి రూ. 5లక్షలోపు రుణం కోసం తీసుకునే రుణాలకు ఐదేళ్లకు 8 శాతం ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో ఈ ప్రత్యేక గృహ రుణ పథకాన్ని అందిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.