భారత ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 30వ తేదీ నాటికి.. భారత విదేశీ మారక నిల్వలు.. 284.391 బిలయన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు వారంలో.. విదేశీ మారక నిల్వలు.. రూ. 285.520 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ వివరాలను వెల్లడించింది.
అమెరికా యేతర కరెన్సీలైన యూరో, స్టెర్లింగ్, యెన్ తదితర నిల్వల్లో ఎగుడుదిగుళ్ల ప్రభావం కారణంగా.. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. అయితే.. అక్టోబర్‌తో ముగిసిన వారం నాటికి బంగారు నిల్వలు.. 10.800 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు ఈ నిల్వలలు.. రూ. 10.316 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
అదలా ఉంచితే.. అంతర్జాతీయ ద్రవ్య నిధుల్లో భారత నిల్వల స్థాయి కూడా పడిపోయింది. అంతకుముందు వారంలో.. ఈ నిల్వలు.. 1.589 బిలియన్ డాలర్లు ఉండేవి.. ఇప్పడది.. 1.581 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లుగా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.