ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెరిగిన టాటా స్టీల్ అమ్మకాలు (India | Steel | TATA Steel | Company | Sales | October | Production | Jumshedpur)
దేశీయ స్టీల్ కంపెనీలలో అత్యంత పెద్దదైన స్టీల్ ఉత్పత్తి సంస్త టాటా కంపెనీ అమ్మకాలు దాదాపు 38 శాతం పెరిగాయి. అక్టోబర్ నెలలో జరిగిన స్టీల్ అమ్మకాలలో 38 శాతం వృద్ధి జరిగినట్లు కంపెనీ ప్రకటించింది.
కంపెనీకి చెందిన జమ్‌షెడ్‌పుర్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి అమ్మకాలలోను వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో తొలి నెల అయిన అక్టోబర్‌లో జరిగిన అమ్మకాలలో 38 శాతం వృద్ధి జరిగి 462000 టన్నులకు చేరుకుంది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన అమ్మకాలతో పోలిస్తే 38 శాతం పెరిగిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా హాట్ మెటల్ 649000 టన్నులు, క్రూడ్ స్టీల్ 599000 టన్నులు, అమ్మకానికి ఉపయోగపడే స్టీల్ 570000 టన్నుల ఉత్పత్తిలో నిరుడు అక్టోబర్ నెలలో క్రమంగా 17.22, 21 శాతం ఎక్కువగా ఉండిందని కంపెనీ తెలిపింది.
నిర్మాణ రంగానికి వినియోగించే స్టీల్ (లాంగ్ ప్రొడక్ట్స్) అమ్మకాలు 89 శాతం, ఫ్లాట్ ప్రొడక్ట్స్ అమ్మకాలు 13 శాతం పెరిగాయని కంపెనీ పేర్కొంది.