సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » యూఐడితో పనిచేయచాలనుకుంటున్న గూగుల్ (UID | People | GOOGLE | MD | Sailesh Rao | Central Govt | Search engine)
Feedback Print Bookmark and Share
 
దేశంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ప్రతి పౌరునికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఐడి)ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కార్యక్రమంలో తమవంతు సహకారం అందించేందుకు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌లో అగ్రగామిగానున్న సంస్థ గూగుల్ ఉత్సుకత చూపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న యూఐడి కార్యక్రమంలో తమవంతు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ రావ్ అన్నారు.

యూఐడికి చెందిన అధికారులు తమ సహాయాన్ని కోరుకుంటే తాము తప్పకుండా అందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటి వరకైతే తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని, ముందుగా కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపితే తాము దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి సహాయమందిస్తామని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.