ప్రపంచంలోనే ప్రముఖ మీడియా, మనోరంజకమైన కార్యక్రమాల ప్రసారంలో అగ్రగామిగానున్న వాల్ట్ డిస్నీ సంస్థ నాల్గవ త్రైమాసికంలో నికర లాభాలు 18 శాతం పెంచుకుని 89.5 కోట్ల అమెరికా డాలర్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది.
గడచిన త్రైమాసికంలో సంస్థకు చెందిన నెట్‌వర్క్ కార్యక్రమాలు చాలా బాగున్నాయని, నాల్గవ త్రైమాసికంలో మీడియా నెట్‌వర్క్ ఆదాయం దాదాపు 14 శాతం పెరిగి 4.72 వందల కోట్ల డాలర్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది.
ఇదే విధంగా కేబుల్ నెట్‌వర్క్ ద్వారా వచ్చిన ఆదాయంలో 26 శాతం వృద్ధి చెంది 1.48 వందల కోట్ల డాలర్లకు చేరుకుందని, అదే విధంగా ఈఎస్‌పిఎన్, ఎబిసిలాంటి కేబుల్ ఛానెళ్ళ ఆదాయం కూడా మెరుగైన ఫలితాలనే సాధించాయని సంస్థ పేర్కొంది.
కంపెనీ తెలిపిన వివరాల మేరకు అక్టోబర్ మూడుతో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో వాల్ట్‌డిస్నీ 89.5 కోట్ల డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించిందని, ఇది నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 76 కోట్ల డాలర్లుగా ఉండిందని కంపెనీ వివరించింది.