సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » గ్యాస్ ధరలను పెంచిన ఓఎన్‌జీసీ, ఓఐఎల్ (Gas | ONGC | OIL | Petroleum Dept | KG Basin | Reliance)
Feedback Print Bookmark and Share
 
దేశీయ సహజ వాయువును ఉత్పత్తి చేసే సంస్థలు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లు సహజ వాయువు ధరను ఏకంగా 33 శాతం పెంచేశాయి.

ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను 33 శాతం పెంచాలని పెట్రోలియం శాఖ ప్రతిపాదించింది. అలాగే కేజీబేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌కిస్తున్నట్లుగా 4.20 డాలర్లకు చేర్చాలని భావిస్తోంది.

ప్రస్తుతం 1.8 డాలర్లుగా ఉన్న ధరను వెంటనే 2.4 డాలర్లకు పెంచాలని పేర్కొంటూ క్యాబినెట్ విడుదల చేసిన నోట్‌ను పెట్రోలియం శాఖ పంపిణీ చేసింది. ఈ ధరను క్రమంగా 2013 నాటికి దాదాపు 4.2 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించినట్లు అదికారులు తెలిపారు.

ఇదిలావుండగా కేజీ-డి6 గ్యాస్‌కు నిర్ణయించిన ధరను దేశంలో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు బెంచ్‌మార్క్‌ రేటుగా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.